* రక్తం గ్రూపులు వేరైనా విజయవంతమైన ఆపరేషన్
* సరికొత్త అధ్యాయం ప్రారంభించిన కర్నూలు కిమ్స్ హాస్పిటల్
* రాష్ట్రంలో తొలిసారి పిల్లలకు ఇలాంటి మార్పిడి
కర్నూలు హాస్పిటల్ , న్యూస్ నేడు: ఆ పాప వయసు పన్నెండేళ్లు. అభం శుభం తెలియని, ఆడుతూ పాడుతూ గడిపేసే ఆ వయసులో పాపకు పెద్ద కష్టం వచ్చింది. ఆమెకు కిడ్నీ సమస్య ఏర్పడింది. 2024 అక్టోబర్ నెలలో సహస్ర అనే ఈ బాలిక కాళ్ల వాపులు, ముఖం వాపు, ఆకలి లేకపోవడం లాంటి సమస్యలతో వచ్చింది. తొలుత ఆమెను నంద్యాలలో చూపిస్తే కిడ్నీ వైఫల్యం అని చెప్పారు. అక్కడ మందులతో చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి పంపారు. తన కుమార్తె కష్టం చూసి ఆ తల్లి హృదయం తల్లడిల్లింది. తన కుమార్తె ప్రాణాలు కాపాడుకోవాలని తానే కిడ్నీ ఇచ్చేందుకు ఆమె సిద్ధమయ్యారు. దీంతో దాత-గ్రహీతల రక్తంగ్రూపు ఒకటి కాకపోయినా విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేసి కర్నూలు కిమ్స్ ఆస్పత్రి చరిత్ర సృష్టించింది.
యాంటీ బాడీలను తగ్గించి…
కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో పాపకు ప్రత్యేకమైన డీసెన్సిటైజేషన్ ప్రోటోకాల్ అమలుచేశాం. ముందుగా ప్రమాదకరమైన యాంటీబాడీలను తొలగించడానికి ప్లాస్మా మార్పిడిచేశాం. అలాగే యాంటీబాడీలు కొత్తగా ఉత్పత్తి కాకుండా మందులు వాడాం. శరీరంలో యాంటీబాడీల స్థాయి తగ్గగానే విజయవంతంగా కిడ్నీ మార్పిడి చేశాం. ఈ వైద్యబృందంలో నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కె.అనంతరావు, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ వై.మనోజ్‌కుమార్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ పృథ్వి, ఎనస్థీషియన్లు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ అఖ్తర్, డాక్టర్ శ్రుతి, డాక్టర్ భువనేశ్వరి, డాక్టర్ ఇందు పాల్గొన్నారు. కిడ్నీ మార్పిడి అనంతరం పాప కిడ్నీ బాగా పనిచేస్తోంది.
అత్యాధునిక ప్రొసీజర్లు చేస్తాం: డాక్టర్ సునీల్ సేపూరి, సీఓఓ, కిమ్స్ ఆస్పత్రి
“ఇకపై ఇలాంటి సంక్లిష్ట శస్త్రచికిత్సల కోసం రాయలసీమ వాసులు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలకు 96% సక్సెస్ రేటుతో కిమ్స్ కర్నూలు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా మారింది. అత్యాధునిక ట్రాన్స్‌ప్లాంట్ టెక్నాలజీలను రాయలసీమకు తేవడం మాకు గర్వకారణం. ఈ ప్రాంతంలో కిడ్నీబాధితులు ఎవరూ వేరే ప్రాంతాలకు చికిత్స కోసం వెళ్లాల్సిన అవసరం రాకూడదన్నది మా లక్ష్యం. అత్యాధునికమైన, సురక్షితమైన కిడ్నీ మరియు కాలేయ మార్పిడిలు మన కిమ్స్ కర్నూలులోనే జరుగుతున్నాయి.”

