దుర్గామాత నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్
కర్నూలు , న్యూస్ నేడు: శుక్రవారం కర్నూలు నగరంలో అక్టోబర్ 3న జరగనున్న దుర్గామాత విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని శ్రద్ధగా, సక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా శుక్రవారం ఆయన సంకల్బాగ్ వద్ద ఉన్న దుర్గా ఘాట్‌ను పరిశీలించారు. అక్కడ వెంటనే పెయింటింగ్ పనులు పూర్తి చేయాలని, ఘాట్ పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. అలాగే, ఘాట్ వైపు వచ్చే రహదారులపై ఉన్న విద్యుత్ దీపాలను మరమ్మత్తు చేసి వెలుగులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డా. విశ్వేశ్వర్ రెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, డీఈఈ గంగాధర్, ఏఈ వైష్ణవి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

