NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆర్​యూలో స్వచ్ఛోత్సవ్ కార్యక్రమం ప్రారంభం..

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీటవేస్తూ నిర్వహిస్తున్న స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో యువత స్వచ్ఛంద భాగస్వామ్యం పెరగాలని రాయలసీమ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సులర్ ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. వర్సిటీ ఎన్​ఎస్​ఎస్ విభాగం ఆధ్వర్యంలో క్యాంపస్లో నిర్వహించిన స్వచ్ఛోత్సవ్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పరిసరాల పరిశుభ్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని పెంపొందించేవిధంగా భారతప్రభుత్వం రూపకల్పన చేసిన ఈ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొనాల్సిన అవసరముందన్నారు. ఎన్​ఎస్​ఎస్ వాలంటీర్లంతా క్యాంపస్లో స్వచ్ఛతకోసం కృషిచేయాలని ఆచార్య బసవరావు హితవు పలికారు. కార్యక్రమంలో వర్సిటీ రీసర్చ్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్ కుమార్, ఎన్​ఎస్​ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. వెంకటరత్నం, డాక్టర్ బి. విజయుడు, డాక్టర్ నాగచంద్రుడుతోపాటు విద్యార్థినీ విద్యార్థులు, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

About Author