NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉల్లి రైతుల‌కు.. సీఎం భరోసా..

1 min read

హెక్టారుకు రూ. 50వేలు ఆర్థిక సహాయం

సీఎం చంద్ర బాబు నాయుడు నిర్ణయంపై రైతులు హర్షం

రాష్ట్ర  పరిశ్రమల శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

అమరావతి, న్యూస్ నేడు : క‌ష్టాల్లో ఉన్న ఉల్లి రైతుల‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంద‌ని రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. ఉల్లి పండించిన ప్రతి రైతుకు హెక్టారుకు రూ.50వేలు ఆర్థిక స‌హాయం అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణ‌యం తీసుకోవ‌డం ప‌ట్ల టి.జి భ‌ర‌త్ కృత‌జ్నత‌లు తెలిపారు. ఈ మేర‌కు మంత్రి ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. త‌మ ప్రభుత్వం రైతుల‌కు ఎలాంటి ఇబ్బందులు వ‌చ్చినా వెంట‌నే స్పందించి త‌గు చ‌ర్యలు తీసుకుంటున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. హెక్టారుకు రూ.50వేలు ఆర్థిక స‌హాయం చేయాల‌న్న నిర్ణ‌యంతో ప్రభుత్వంపై వంద కోట్ల రూపాయ‌ల‌కు పైగా భారం ప‌డిన‌ప్పటికీ సీఎం చంద్రబాబు వెన‌క్కు త‌గ్గకుండా రైతుల‌కు మేలు చేసేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్లు మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. ఈ ఆర్థిక స‌హాయం ద్వారా 24,218 మంది రైతుల‌కు ల‌బ్ది చేకూరుతుంద‌న్నారు. రైతుల‌కు మేలు చేస్తుంటే ఓర్వలేని వైసీపీ నాయ‌కులు ప్రభుత్వంపై బుర‌ద‌జ‌ల్లుతున్నార‌న్నారు.

About Author