NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రధాని మోదీ…మాట తప్పారు…

1 min read

నల్లధనం వెలికి తీయలేదు.. కుటుంబానికి ఏడాదికి రూ.15 లక్షలు ఇవ్వలేదు..

  • రూ.14.50లక్షలు బ్యాంకు లోన్​ మాఫీ చేశారు..
  • ఎవరెవరికి చేశారో… సమాధానం చెప్పండి..
  • ఏపీలో రాజధాని..  సీమలో ఉంటే బాగుండేది..
  • కులాల మధ్య చిచ్చు పెట్టడం.. సామాజిక న్యాయమా..
  • ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు సమాధానం చెప్పండి
  • కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు చింతా మోహన్​

కర్నూలు, న్యూస్​ నేడు: పదకొండేళ్ల క్రితం దేశంలో నల్లధనం వెలికి తీస్తానని, ఏడాదికి  కుటుంబానికి రూ. 15 లక్షలు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోదీ  మాట ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదని ఆరోపించారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు చింతా మోహన్​. శుక్రవారం కర్నూలులోని ఓ హోటల్​ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. 11 ఏళ్ల కాలంలో నిరుపేదలకు, రైతులకు రుణాలు మాఫీ  చేయలేదు.. కానీ బడా వ్యాపారులకు రూ.14.50 లక్షల కోట్లు మాఫీ చేశారని, ఎవరెవరికి మాఫీ చేశారో కేంద్ర ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని మీడియా ముఖంగా ఆయన కోరారు. ఏపీలో రాజధాని రాయలసీమలో ఉంటే బాగుండేదని, అమరావతిలో నిర్మిస్తుండటంతో అన్ని జిల్లాల ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు.  రాష్ట్రంలో సామాజిక న్యాయం అని సీఎం చంద్ర బాబు నాయుడు చెబుతున్నారని, కానీ కులాల మధ్య చిచ్చు పెట్టడం సామాజిక న్యాయం అవుతుందా అని  కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్​  విమర్శించారు.  సమావేశంలో కాంగ్రెస్ నాయకులు అశోక్ రత్నం, వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.

About Author