NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జీఎస్టీ తగ్గింపు ఫలాలు జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలపండి..

1 min read

జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి

సూపర్ సేవింగ్స్ తో ముద్రించిన కరపత్రాలు విడుదల

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : జీఎస్టీ తగ్గింపు ఫలాలు జిల్లాలో ప్రతీ ఒక్కరికీ తెలియజేసేలా పక్క ప్రణాళికతో  విస్తృత ప్రచారం చేయాలనీ జిల్లా కలెక్టర్ కమర్షియల్ టాక్స్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం  సూపర్ జిఎస్టి.సూపర్ సేవింగ్స్ నినాదంతో ముద్రించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ   జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఏ మేరకు ఆదా అవుతున్నదో ప్రతీ కుటుంబానికి తెలియజేయాలన్నారు. వివిధ వర్గాల వర్తకులతో సంప్రతించి పెద్దఎత్తున షాపింగ్ ఫెస్టివల్స్ ఏర్పాటుచేయాలన్నారు. ఈనెల 26 నుండి అక్టోబర్,18 వ తేదీ వరకు జీఎస్టీ టాక్స్ రేట్ల తగ్గింపు కారణంగా ఏ వస్తువుల ధరలు ఏ మేరకు తగ్గుతున్నాయో తెలియజేస్తూ  వారం వారం వివిధ అంశాలపై ప్రతీ మండలంలోనూ గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కమర్షియల్ టాక్స్ జాయింట్ కమీషనర్ బి.నాగార్జునరావు,  అసిస్టెంట్ కమిషనర్లు టి. విజయభాస్కర్,బి. శ్రీనివాసరావు,అరుణకుమారి, ప్రభృతులు పాల్గొన్నారు.

About Author