జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విజ్ఞాన్ స్కూల్ విద్యార్థిని ఉమామహేశ్వరి
1 min read

ప్రశంసించిన పాఠశాల కరస్పాండెంట్ మోహన్, ఉషాపరిమళ
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని బోయ ఉమామహేశ్వరి ఇటీవల ఎమ్మిగనూరు లో జరిగిన అండర్ 19 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఫుట్బాల్ పోటీలో పాల్గొని, పలు జిల్లాల నుంచి దాదాపు 230 మంది క్రీడాకారులు పాల్గొనగా అందులోనుంచి పట్టణానికి చెందిన ఉమామహేశ్వర తన వ్యక్తిగత ప్రతిభను చాటి ఐదు గోల్స్ లను సేవ్ చేసి గోల్ కీపర్ గా ఎంపికవ్వడం గొప్ప విషయం. ఈ సందర్భంగా శుక్రవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని ఉమా మహేశ్వరికి పాఠశాల కరెస్పాండంట్ మోహన్, హెడ్ మాస్టర్ ఉషాపరిమళ లు మిఠాయిలు తినిపించి అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ..మా పాఠశాలలో చదివే విద్యార్థి జాతీయస్థాయి ఎంపికవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. ఎంపికకు కృషి చెసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయుడు రాము ని ప్రత్యేకంగా కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సతీష్, కేశవ, రవికుమార్, విద్యార్థి తల్లిదండ్రులు బోయ శ్రీనివాసులు, బోయ సుజాత తదితరులు పాల్గొన్నారు.

