అత్యవసర సేవలకు డయల్ 112 కు కాల్ చేయండి
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆపదలు, అత్యవసర పరిస్ధితులు, ఎమైనా సమస్యలు , అసాంఘిక కార్యకలపాలు ఎదైనా మీ దృష్టికి వచ్చినా వెంటనే డయల్ 112 కి జిల్లా ప్రజలు కాల్ చేసి సమాచారం అందించండి. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ప్రజలు , బాధితులు అత్యవసర పరిస్ధితులలో , ఆపద సమయాల్లో ఎమైనా సమస్యలు , అసాంఘిక కార్యకలపాలు ఎదైనా మీ దృష్టికి వచ్చినా వెంటనే డయల్ 112 కి కాల్ చేసి సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ శుక్రవారం తెలిపారు. గొడవలు, తగాదాలు, కుటుంబ సమస్యలు , అనుమానాస్పద వ్యక్తుల కదలికల వివరాలు ఎదైనా మీ దృష్టికి వచ్చినా కూడా వెంటనే డయల్ 112 కి జిల్లా ప్రజలు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు. డయల్ 112 కు కాల్ చేసినా వెంటనే స్పందించి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బ్లూ కోల్ట్స్, రక్షక్, పోలీస్ వారు కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి చేరుకొని సమస్యను తెలుసుకుని, తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డయల్ 112 హెల్ప్ లైన్ నెంబర్ 24X7 కమాండ్ కంట్రోల్ కు అనుసంధానమై అందుబాటులో ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయిలో విధుల్లో ఉన్న బ్లూ కోల్ట్స్, రక్షక్, పోలీస్ సిబ్బందికి క్షణాల్లో సమాచారం వెళుతుందన్నారు.

