అన్న క్యాంటీన్లపై పర్యవేక్షణ తప్పనిసరి
1 min read
కోఆర్డినేటర్లకు కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశం
మూడు పూటలా తనిఖీ చేయాలని సూచన
ఆహార నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టీకరణ
పరిసరాల పరిశుభ్రత, శుభ్రంగా ఆహారం వడ్డించాల్సిందే
అభివృద్ధి పనుల వద్ద వర్క్ ఇన్స్పెక్టర్లు తప్పనిసరిగా ఉండాలి
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం నగరంలోని 5 అన్న క్యాంటీన్లపై కోఆర్డినేటర్ల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, ప్రతి రోజు మూడు పూటలా స్వయంగా తనిఖీ చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదేశించారు. మంగళవారం ఆయన పరిమళ నగర్, ప్రభుత్వ ఆసుపత్రి, సెట్కూరు కార్యాలయం సమీపంలోని అన్న క్యాంటీన్లను అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలకు అందించే అన్నపూర్ణ భోజనంలో ఎటువంటి రాజీ ఉండకూడదని, ఆహార నాణ్యతను మూడు పూటలా కచ్చితంగా పరిశీలించాలని సూచించారు. వడ్డించే సమయం, పరిసరాల పరిశుభ్రత, పాత్రల శుభ్రత, శ్రద్ధగా ఆహారం వడ్డించడం అన్నీ తప్పనిసరిగా పాటించాలని, ఆహారం వడ్డించే సిబ్బంది చేతులకు బ్లౌజులు, రక్షణ వస్త్రాలు వేసుకోవాలని సూచించారు.అలాగే నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వద్ద వర్క్ ఇన్స్పెక్టర్లు తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ ప్లాజా వద్ద పెయింటింగ్ పనులను స్వయంగా పరిశీలించిన ఆయన, అక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

