ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమం
1 min read

నిరంతరం ప్రజలందరికీ అందుబాటులో ఉండటమే నా లక్ష్యం
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకుని ప్రతినెలా విధిగా సామాజిక పెన్షన్ల పంపిణీ క్రతువును సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. నిరంతరం సామాన్యులకు అందుబాటులో ఉండడమే తన ఏకైక లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు 23వ డివిజన్ పిరంగుల దిబ్బలో బుధవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ఆ డివిజన్లోని అర్హులైన లబ్దిదారుల ఇళ్ళకు స్వయంగా వెళ్ళిన ఎమ్మెల్యే చంటి,,, పెన్షన్ మొత్తాలను అందించారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నట్లు చెప్పారు.కార్యక్రమంలో ఏపిఎస్ ఆర్టీసి విజయవాడ జోన్ – 2 ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఈడా ఛైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎ. భానుప్రతాప్, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ కలవకొల్లు సాంబ, క్లస్టర్ ఇంచార్జ్ గూడవల్లి శ్రీనివాస్, డివిజన్ ఇంచార్జ్ రెడ్డి రామకృష్ణ, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు,మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మై బాబు, కుటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

