పదవ రోజుకు చేరిన నాయక కులస్తుల రిలే నిరాహార దీక్ష
1 min read

సంబంధిత అధికారులు నాయక కులస్తుల న్యాయమైన కోరిక నెరవేర్చాలి
ఘంటా సత్యంబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : కామవరపుకోట మండలంలో నాయక కులస్తులకు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వాలని జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఈరోజు పదో రోజుకు చేరుకున్నా సరే అధికారుల నుంచి ఇటువంటి స్పందన రాలేదు. ఈ కార్యక్రమంలో ఈరోజు గంటా సత్యంబాబు,టీవీఎస్ రాజు, కమ్యూనిస్ట్ లీడర్ అందుగుల ఫ్రాన్సిస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.గంటా సత్యంబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోనాయక కులస్తులు ఎంతో కాలంగా ఎస్టీ సర్టిఫికెట్లు తీసుకుంటూ నివసిస్తున్నారు. పూర్వం వేటాడుతూ,పొడి వ్యవసాయం చేస్తూ జీవించేవారు. అట్లాంటి వీరికి ఎస్టి సర్టిఫికెట్ ఇవ్వకపోవడం చాలా దారుణమైన విషయము దీనిపైన అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.టీవీఎస్ రాజు, మరియు ఫ్రాన్సిస్, మాట్లాడుతూ వీళ్ళు పది రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు అధికారుల స్పందించకపోవడం చాలా దారుణంగా ఉంది వెంటనే స్పందించకపోతే తదుపరి యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని డిమాండ్ చేశారు.కొమరం భీం నాయక కులస్తులు మాట్లాడుతూ ఈ విషయంపై ఎమ్మెల్యే మాట్లాడిన , అధికారుల నుంచి ఇటువంటి స్పందన రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యమాన్ని ఉధృతం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అని నాయకుల సంఘం తీర్మానించింది.

