NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేషనల్ వాలంటరీ రక్తదాన దినోత్సవం

1 min read

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కార్యక్రమం

ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో రక్తదానానికి సహకరించాలి

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం.శేఖర్ బాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంథాలయశాఖ సంచాలకులవారి ఆదేశాల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లా గ్రంథాలయసంస్థ,ఏలూరు జిల్లాకేంద్ర గ్రంథాలయంలో “రక్తదాన శిబిరం దినోత్సవం” “నేషనల్ వాలంటరీ రక్తదానo దినోత్సవం”సందర్భంగా ఏలూరుజిల్లా కేంద్ర గ్రంథాలయం ఆధ్వర్యంలో బుధవారం “ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ” వారుహాజరై రక్తదాన శిబిరం  కార్యక్రమంను నిర్వహించినట్లు జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి  ఎమ్.శేఖర్ బాబు తెలిపారు.   ఈ కార్యక్రమంనకు జిల్లా గ్రంథాలయసంస్థ కార్యదర్శి  ఎమ్.శేఖర్ బాబు అధ్యక్షత వహించారు. అనంతరం విద్యార్థులు ముంధుకువచ్చి రక్త దాన చేసినారు. రెడ్‌క్రాస్ వారు దాతలుచేత ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమములో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పి.అర్.ఓ. కె.వి.రమణ, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ సభ్యులు అలపాటి నాగేశ్వరరావు, ఎల్.వెంకటేశ్వరరావు సీనియర్అసిస్టెంట్, జిల్లాకేంద్ర గ్రంథాలయం సిబ్బంది, పాఠకులు,తధితరులు పాల్గొన్నారు.

About Author