NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పథకలు

1 min read

ప్యాపిలి, న్యూస్​ నేడు: ప్యాపిలి మండలంలోని హుస్సేనాపురం గ్రామంలో బుధవారం డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  ప్రజలకు సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ పథకం ప్రయోజనాలను వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల  మాట్లాడుతూ,ప్రభుత్వం ప్రజల భారం తగ్గించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రతి కుటుంబం గణనీయమైన ఆదా చేసుకోగలుగుతుంది. కిరాణా సామాగ్రి మరియు నిత్యావసర వస్తువులపై 13% జీఎస్టీ తగ్గింపు, స్టేషనరీ మరియు మందులపై 7% నుండి 12% వరకు తగ్గింపు, అలాగే దుస్తులు మరియు పాదరక్షలపై 7% జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి వార్షికంగా దాదాపు ₹15,000 ఆదా అవుతుంది” అని ఎమ్మెల్యే  పేర్కొన్నారు.జీఎస్టీ తగ్గింపుతో సాధారణ ప్రజలు ఆర్థికంగా ఊరట పొందుతారు.ఈ నిర్ణయం ప్రత్యేకంగా మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు మేలును చేస్తుంది. ఇది కేవలం ఆర్థిక ఉపశమనం మాత్రమే కాకుండా, వినియోగదారుల విశ్వాసాన్ని పెంచే ఒక చారిత్రాత్మక నిర్ణయం అని ఎమ్మెల్యే  అన్నారు. ఈ కార్యక్రమంలో డిసి ఎం చైర్మన్ వై నాగేశ్వరావు యాదవ్, సీనియర్ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎమ్మార్వో భారతి, ఎస్సై నాగార్జున, తెదేపా నాయకులు ఎద్దులదొడ్డి ప్రభాకర్ రెడ్డి, చండ్రపల్లి లక్ష్మీ నారాయణ యాదవ్,  గడ్డం అంకిరెడ్డి, పి ఆర్ ఏ ఈ ప్రభాకర్ రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకులు ఖజా పీర్, కొంగనపల్లి మధు, ప్రిన్సిపాల్ మధు,శ్రీకాంత్, మాధవరం స్వామి, హుస్సేనాపురం కుమార్, తిమ్మారెడ్డి, గంగాధర్, ప్రహల్లాద, నల్ల మేకల పల్లె రాజశేఖర్, నాగేశ్వరరావు, జక్కసానిగుంట్ల జయరామయ్య, వెంకట రాముడు, బోన్ చెరువు పల్లె కృష్ణయ్య, కాంతారావు, శివారెడ్డి, దామోదర్ నాయుడు తదితరులు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, సచివాలయం ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.

About Author