NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వృద్ధుల కు న్యాయ విజ్ఞాన శిబిరం ఏర్పాటు…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి శ్రీ బి .లీలా వెంకట శేషాద్రి  ఆదేశాల మేరకు ‘మన ‘వృద్ధాశ్రమంలో లీగల్ సర్వీస్ యూనిట్ మెంబర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన  వృద్ధుల కు న్యాయ విజ్ఞాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం   కర్నూలు జిల్లా అధ్యక్షులు, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్  మెల్విన్   జోన్స్ ఉపాధ్యక్షులు మురారి శంకరప్ప మాట్లాడుతూ వృద్ధుల పట్ల గౌరవం ,ఆదరణ, స్నేహభావాన్ని  పెంపొందించుకోవడం నేటి యువతీ యువకులు అలవర్చుకోవాలన్నారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ జయప్రకాష్ మాట్లాడుతూ  వృద్ధుల ఆరోగ్యం, సంక్షేమం,భద్రత కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. వృద్ధాశ్రమంలోని కంటి సమస్యలు ఉన్న వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్  ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ వైస్ ప్రెసిడెంట్ లయన్ కే.డీ.జే బాబు మాట్లాడుతూ కుటుంబంలో ఉర్దూలను నిర్లక్ష్యం చేయకుండా వారితో గడిపేందుకు నేటి యువతి యువకులకు తల్లిదండ్రులు నేర్పించాలన్నారు. లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్ పారా లీగల్ వాలంటీర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవం జరుపుకుంటామని ,వృద్ధుల సమస్యలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పరిష్కరించడానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం వృద్ధులకు పళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు తదితర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

About Author