NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిఎస్ఎన్ఎల్ రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకలు

1 min read

బిఎస్ఎన్ఎల్  సంస్థ ఏర్పాటు అయ్యి 25 సంవత్సరాలు పూర్తి.

సురక్షితమైన ,అతి తక్కువ ధరలతో, విశ్వసనీయమైన  సేవలతో బిఎస్ఎన్ఎల్ భారత్ ను కలుపుతోందని ,

25 వ వ్యవ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జి రమేష్ .

కర్నూలు, న్యూస్​ నేడు:  భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సంస్థ ఏర్పాటు అయ్యి  25 సంవత్సరాలు  పూర్తి చేసుకున్న సందర్భంగా  రజతోత్సవ వ  వేడుకలను  జరుపుకుంటున్న దని , బిఎస్ఎన్ఎల్ సురక్షితమైన, చౌక ధరలతో,  నమ్మకమైన సర్వీసులతో భారతదేశన్నంతటినీ కలుపుతున్నదని కర్నూలు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్  శ్రీ జి .రమేష్  తెలిపారు.స్థానిక బిఎస్ఎన్ఎల్ భవన్ నందు జరిగిన వ్యవస్థాపక దినోత్సవం సమావేశంలో మాట్లాడుతూ  బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులకు,  వినియోగదారులకు  మరియు భాగస్వాములకు  బిఎస్ఎన్ఎల్ వ్యవస్థాపక మరియు రజతోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ సంస్థ  అక్టోబర్ 1వ తేదీ 2000 వ సంవత్సరంలో ప్రభుత్వ రంగ పబ్లిక్ సెక్టార్ యూనిట్ గా రూపుదిద్దుకున్నప్పటి నుండి ప్రజలకు చేరువగా మారుమూల గ్రామాలకు కాపర్ ద్వారా ల్యాండ్ లైన్,  బ్రాడ్ బ్యాండ్  సేవలను అందించి టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా  పూర్తి ఫైబర్ టెక్నాలజీ ద్వారా వాయిస్ మరియు హై స్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తున్నదని తెలిపారు . వినియోగదారులు తమ పాత సిమ్ కార్డులను 4 జి సిమ్ కార్డులుగా మార్చుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సాయినాథ్ గారు మరియు  ఏ జి ఎం లు  , శ్రీ వి.శ్రీను నాయక్ , శ్రీ దేవచంద్ నాయక్ , శ్రీ లక్ష్మ నాయక్,  శ్రీ మురళీకృష్ణ , శ్రీ నారాయణ స్వామి,  శ్రీ వి జాన్సన్ మరియు శ్రీ నారాయణ స్వామి , ఇతర బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్లు సిబ్బంది పాల్గొన్నారు.

About Author