శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో 87వ విశ్వశాంతి మహాయాగం
1 min read

అక్టోబర్ 31 నుండి నవంబర్ 14 వరకు 15 రోజులు మహాయాగం
15 రోజులు యజ్ఞం హోమం పూజా కార్యక్రమాల నిర్వహణ
500 నుండి 600 మంది వేద పండితులు యజ్ఞంలో పాల్గొంటారు.
40 నుండి 50 వేల లీటర్ల ఆవు నెయ్యితో హోమాలు
విశిష్ట యాగాలు హోమాలు కళ్యాణాలు జరుగును
20 లక్షల దీపోత్సవం నిర్వహించబడును
లక్ష శివలింగాలకు వేయి లీటర్ల పాలతో రుద్రాభిషేక
పీఠాధిపతులు వేద పండితులు రాక
15 రోజులు ఉదయం సాయంత్రం అల్పాహారం మధ్యాహ్నం భోజనం
విశ్వశాంతి కోసమే ఈ యాగం పండితులు శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి
ప్రభుత్వం తరఫున స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి తరపున యాగానికి అన్ని ఏర్పాట్లు సహాయ సహకారాలు
ఏర్పాట్లను పూజ చేసి ప్రారంభించిన టిడిపి నాయకులు వ్యాపారవేత్త భాస్కర్ల చంద్రశేఖర్
వీవర్స్ కాలనీ మైదానం ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో ఈనెల 31 నుండి నవంబర్ 14 వరకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి సహాయ సహకారాలతో మరియు వేద పండితుల శ్రీ శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో “87వ విశ్వశాంతి మహాయాగం” నిర్వహిస్తున్నట్లు పండితులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారవేత్త భాస్కర్ల చంద్రశేఖర్ తెలిపారు. అందుకు సంబంధించి శుక్రవారం పట్టణంలోని వివర్స్ కాలనీ మైదానంలో ఏర్పాటులను పూజలు చేసి ప్రారంభించారు. ఈ మహా యాగం 15 రోజులు పాటు నిర్వహిస్తున్నట్టు తెలిపారు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి 500 నుండి 600 మంది వేద పండితులతో పాటు వివిధ మఠం ల నుండి పీఠాధిపతులు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అయిత చండీయాగం అతిరిద్ర యాగం మహాగణపతి యాగం మహాసూర్య యాగం రామాయణం మహాభారతం హోమాలు నక్షత్రయాగం నవగ్రహ యాగం సరస్వతి యాగం విశిష్ట యాగాలు తోపాటు సీతారాముల వారి పట్టాభిషేకం ఒకరోజు లక్ష బిల్వర్చన మరొక రోజు కోటి బిల్వర్చన కుంకుమార్చన తులసి అర్చన లతో పాటు రుద్రాభిషేకాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు లక్ష శివలింగాలకు వెయ్యి లీటర్ల పాలతో రుద్రాభిషేకం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీతారాముల కళ్యాణంతో లక్ష్మి నరసింహ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం విశిష్ట కళ్యాణాలు నిర్వహిస్తామన్నారు అంతే కాకుండా 20 లక్షల దీపోత్సవాలు ఏర్పాటు చేస్తామన్నారు మొత్తం మీద యజ్ఞం హోమం పూజా కార్యక్రమాల్ని నియోజకవర్గంలోని ప్రజలతోపాటు జిల్లాలోని అందరూ కూడా పాల్గొని విశ్వశాంతి మహా యాగాన్ని దిగ్విజయం చేసి దేవతామూర్తుల ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జగనాగేశ్వర్ రెడ్డి గారు ఎంతో సాయం అందిస్తున్నారని ఆయనకు యాగం నిర్వాహకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. దేశ ప్రపంచ శాంతి కొరకు మరియు వాతావరణ సమతుల్యత కొరకు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అలాగే ప్రభుత్వం ప్రజలకు మంచి చేసే విధంగా ఉండాలని ప్రజలు కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని ప్రభుత్వ క్షేమం కొరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమ నిర్వహణకు ఉచితంగా విరాళాలు ఇచ్చేవారు ముందుకు రావాలని కార్యనిర్వాహన దాతలు ఇచ్చే విరాళాల నుండే నిర్వహించబడుతుందని తెలిపారు._ తెలుగుదేశం పార్టీ నాయకులు పారిశ్రామికవేత్త భాస్కర్ల చంద్రశేఖర్ 87వ విశ్వశాంతి మహాయాగం ఎమ్మిగనూరులో జరగడం ఎమ్మిగనూరు పట్టణం ప్రజలు చేసుకున్న పుణ్యమని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యాపారవేత్త చంద్రశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమం 15 రోజులు నిర్వహించబడుతుందని ఇందుకు సంబంధించిన ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే ఆదేశించడం జరిగిందని ప్రతి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు, కూటమి నాయకులు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం విజయవంతం అయ్యేంతవరకు ముందుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే సహాయ సహకారలు నిర్వహించబడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. యాగంలో ప్రజలందరూ పాల్గొని యాగం హోమ పూజ ఫలాలను పొందాలని ఆయన కోరారు._ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య, టిడిపి నాయకులు శివశంకర్, అల్ఫ్రెడ్ రాజు, జగదీష్ మహీంద్రా, నవాజ్, బీజేపీ నాయకులు లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

