NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను  పరిశీలించిన రాష్ట్ర విద్యాశాఖ  సంచాలకులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  మెగా డీఎస్సీ -2025 ఎంపికైన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులను శనివారం విద్యాశాఖ సంచాలకులు అబ్రహం కర్నూలు జిల్లా డీఈవో శ్యామ్యూల్ పాల్, నంద్యాల డిఈఓ జనార్ధన రెడ్డి  మరియు సమగ్ర శిక్ష కుసుమలతో కలసి సందర్శించారు. శిక్షణా కేంద్రాలైన రాఘవేంద్ర బీఈడీ కాలేజీ, శ్రీనివాస బి.ఎడ్ కాలేజీ, అమీలియో కాలేజ్ ఆఫ్ బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కేంద్రాలలో జరుగుతున్న  డిఎస్ సిలో ఎంపికైన అభ్యర్థుల ఇండక్షన్ ట్రైనింగ్ తరగతులను పరిశీలించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వ్యవస్థను మార్చే శక్తులుగా ఉపాధ్యాయులు  తయారవ్వాలని, సాంకేతికతతో ముందుకు పోతున్న సమాజాన్ని మరింత ఆధునికతతో  అన్నారు. గ్రామీణ పేద మధ్యతరగతి  విద్యార్థులను ఈ పోటీ ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టాలని ఉపాధ్యాయులను కోరారు. ఉపాధ్యాయ వృత్తిలో త్రికరణ శుద్ధిగా పనిచేయడమే ఉపాధ్యాయ జీవితానికి సంతృప్తినిస్తుందని అన్నారు. తరగతి గదిలో  విద్యార్థుల మనసెరిగి బోధించిన ఉపాధ్యాయులనే సమాజం గుర్తిస్తుందని అన్నారు. మీ మీ ప్రజ్ఞా పాఠవాలతో నైపుణ్యవంతమైన, నాణ్యమైన, విజ్ఞానమైన, తేజోవంతమైన బోధనా పద్ధతులతో విద్యార్థులను ఆకట్టుకొని చరిత్రను సృష్టించాలని అన్నారు.

About Author