అర్హులైన ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 15 వేలు ఆర్థిక సహాయం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం కింద అర్హులైన ఆటో, టాక్సీ మరియు మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏటా ₹15,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. ‘ఆటో డ్రైవర్ల సేవ లో’ సొంత ఆటోరిక్షా, క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ ఉన్న డ్రైవర్లు ఈ పథకానికి అర్హులు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆదాయం తగ్గిన ఆటో డ్రైవర్లకు మద్దతుగా ఈ పథకాన్ని ప్రారంభించారు.అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి ₹15,000 ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.మొదటి విడత అక్టోబరు 4, 2025న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి, దాదాపు 2.90 లక్షల మంది డ్రైవర్ల ఖాతాల్లో ₹436 కోట్లను జమ చేశారు.ఇది గతంలో ఉన్న ‘వాహన మిత్ర’ పథకం పునరుద్ధరణగా భావించవచ్చు. మునుపటి ప్రభుత్వం ఇచ్చిన ₹10,000 కన్నా కూటమి ప్రభుత్వం ₹15,000 ఇస్తోందని వాహన బీమా, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు మరియు ఇతర నిర్వహణ ఖర్చులకు డ్రైవర్లకు ఈ మొత్తం ఉపయోగపడుతుందని కర్నూల్ 4 వార్డ్ టీడీపీ ఇంచార్జ్ ఊట్ల రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. 4 వ, వార్డ్ లో దాదాపు 42 మంది ఆటో డ్రైవర్లు లబ్ది పొందారు. ఈరోజు ఊట్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో లబ్ది పొందిన ఆటో డ్రైవర్లు మరియు వార్డు టీడీపీ భూతు ఇంచార్జ్ లు, స్థానికుల అందరు కలిసి సీఎం. చంద్రబాబు నాయుడు కి, నారా లోకేష్ కి, కర్నూల్ ఎమ్మెల్యే, మరియు మినిస్టర్ టీజీ. భరత్ కి ధన్యవాదములు తెలుపుతూ.సిఎం.చంద్రబాబు నాయుడు పటానికి క్షిరాభి షేకం చేశారు.

