వైసీపీలో మోమిన్ మన్సూర్ కు ఉన్నత పదవి..
1 min read

వైఎస్సార్ టియుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం
పదవితో పార్టీ అభివృద్ధికి కృషి..
మిడుతూరు, (నందికొట్కూరు) న్యూస్ నేడు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నందికొట్కూరు నియోజకవర్గ మైనార్టీ నాయకులు మోమిన్ మన్సూర్ కు ఉన్నత పదవి లభించింది.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామానికి చెందిన మన్సూర్ కు వైఎస్సార్ టియుసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నందికొట్కూరు వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ మరియు బైరెడ్డి మల్లికార్జున రెడ్డి, వైయస్సార్ టియుసి రాష్ట్ర అధ్యక్షులు గౌతం రెడ్డిల సహకారంతో నాకు పదవి వచ్చిందని మన్సూర్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవే నా ధ్యేయంగా పని చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోమిన్ మన్సూర్ తెలిపారు.ఈ సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గం లోని వైసీపీ నాయకులు శాలువా పూలమాలలతో మన్సూర్ ను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

