జి పి ఆర్ ఎస్ అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
1 min read

అర్జీలు పరిష్కార తీరు పారదర్శకంగా,నాణ్యతతో ఉండాలి
జిల్లాకలెక్టర్ కె.వెట్రిసెల్వి
పిజీఆర్ఎస్ లో 248 అర్జీలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పిజిఆర్ఎస్ లో ప్రజలు సమర్పించిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవచూపాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్విఅధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకీదేవి, సర్వే ఏడి అన్సారీ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆయా శాఖల వారీగా వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు, ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని ఆదేశించారు. పీజేఆర్ ఎస్ లో ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కార సరళిపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. పి జి ఆర్ ఎస్ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహించి క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్ర స్థాయిలోనే పరిష్కార మార్గాలు చూపించి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.సోమవారం జరిగిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో 200సోమవారం జరిగిన పీజిఆర్ఎస్ కార్యక్రమంలో 248 దరఖాస్తులు అందాయి. దరఖాస్తు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు,కలెక్టరేటు సిబ్బంది పాల్గొన్నారు.

