NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే 1930 కి సమాచారం అందించాలి

1 min read

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్

 పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ ఫిర్యాదుల పరిష్కార వేదిక

ఏలూరు, న్యూస్​ నేడు:  ఏలూరు జిల్లాలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గల సమావేశ మందిరంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్, ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమమును  జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ నిర్వహించినారు.ఈరోజు మొత్తం 45 ఫిర్యాదులు అందగా,వాటిలో ఎక్కువగా భూ వివాదాలు, కుటుంబ తగాదాలు మరియు మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన ఎక్కవ పిర్యాదులు అందినవి, ఎస్పీ  ఫిర్యాదుదారుల తో నేరుగా మాట్లాడి వారి యొక్క సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని,సదరు ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ చేసి నివేదికలను సమర్పించవలసినదిగా క్రింది అధికారులకు తగిన సూచనలు సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చినారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని, డబ్బును వృథా చేయకుండా నేరుగా తమ సమీప సబ్-డివిజన్, సర్కిల్  పోలీసు అధికారులకు అంద చేయవచ్చని ఎస్పీ గారు తెలిపారు.ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదులు చేయాలనుకునేవారు https://meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ను ఉపయోగించుకోవచ్చని సూచించారు.ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్ ను సంప్రదించ వచ్చని తెలియజేశారు.పబ్లిక్ గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో సీబీఐ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అని ఇతర పోలీసు అధికారుల పని వృద్ధులకు ఫోన్లు చేస్తూ వారి పిల్లలపై కేసులు నమోదు చేసినట్లు ఈ విషయాలను ఎవరికైనా చెప్తే ప్రమాదాలను కొని తెచ్చుకుంటారని బెదిరింపులకు గురిచేసి డబ్బులను తస్కరించే సైబర్ నేరల పట్ల తగిన జాగ్రత్తలను తీసుకోవాలని, ఎవరికైనా అటువంటి ఫోన్ కాల్స్ వస్తే అధైర్య పడకుండగా ప్రజలు వెంటనే ఎడల 1930 కు  సమాచారం అందించాలని వారు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారని తెలియ చేసినారు.ఈ పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదుదారులకు ఏలూరు శ్రీ సత్య సాయి సేవా సంఘం వారు భోజన ఏర్పాట్లు చేసినారు.

About Author