తరిగోపుల’లో క్యాన్సర్ నివారణ టీకాలు..
1 min read

జానకీ రాం పౌండేషన్ఆధ్వర్యంలో టీకాలు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల పరిధిలోని తరిగోపుల గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం కర్నూలు ఓమేగా హాస్పిటల్ బచ్చు జానకీ రామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ నివారణ టీకాలు వేశారు.ఓమెగా హాస్పటల్ ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్.రవీంద్ర బాబుఆరు నెలల క్రితం గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు డాక్టర్లు బి.రవీంద్ర బాబు,బి సాయి వాణి ఉచితంగా టీకాలు వేశారు.రెండో విడతగా డోసును వేసినట్లు డాక్టర్లు తెలిపారు.విద్యార్థులు,తల్లి దండ్రులు పాఠశాలలో డాక్టర్ రవీంద్ర బాబు సొంత గ్రామంలో ఉచితంగా టీకాలు వేయడం సంతోషించ దగ్గ విషయమని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఖరీదైన హెచ్ పివి క్యాన్సర్ నివారణ టీకాలు వేస్తున్నందుకు బచ్చు జానకి రామ్ ఫౌండేషన్ కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి,జయ నాగేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయులు మరియు కర్నూల్ కిడ్నీ,క్యాన్సర్ కేర్ గాయత్రి ఎస్టేట్ కర్నూల్ హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు.

