వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా మాజీ ఎమ్మెల్యే నియామకం
1 min read
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ కె. చెన్నకేశవ రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి అత్యున్నత నిర్ణయాధికార వర్గమైన సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సి ఈసీ)లో సభ్యుడిగా నియమితులయ్యారు. ప్రజాసేవపైన చూపిన అంకితభావం, వైయస్ఆర్ సిద్ధాంతాలపై విశ్వాసం, ప్రజలతో కుదుర్చుకున్న ఆత్మీయ బంధం ఈ నియామకానికి ప్రధాన కారణమని పేర్కొన్నరు.పార్టీ బలోపేతానికి ఆయన జ్ఞానం, అనుభవం మరిన్ని మార్గాలను ప్రసారం చేస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఈ నియామకం సందర్భంగా ఎమ్మిగనూరులో హర్షాతిరేక వాతావరణం నెలకొంది.కర్నూలు జిల్లా మాజీ వక్ఫ్ బోర్డ్ వైస్ చైర్మన్ కొండాపూరి రియాజ్ అహమ్మద్, ఎమ్మిగనూరు కో–ఆపరేటివ్ సొసైటీ మాజీ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ షాబుద్దీన్, మున్సిపల్ కో–ఆప్షన్ నెంబర్ అబ్రార్ , 18వ వార్డు ఇంచార్జ్ సోమేశ్, మాజీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ రజాక్, మెకానిక్ భాషా తదితరులు ఆయన నివాసంలో కలుసుకొని ఘనంగా సన్మానించారు. షాలువా కప్పి, పుష్పగుచ్ఛం అర్పిస్తూ కొత్త బాధ్యతలపై శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రియాజ్ అహమ్మద్ మాట్లాడుతూ, “చెన్నకేశవ రెడ్డి ప్రజలతో మమకారం కలిగిన నాయకులు. వైయస్ఆర్ స్ఫూర్తిని నిలబెట్టే తీరు, ప్రజా సమస్యలను పరిష్కరించే తపన ఆయన నాయకత్వానికి నిదర్శనం” అని అన్నారు.తన నియామకంపై స్పందించిన శ్రీ కె. చెన్నకేశవ రెడ్డి గారు మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పం నాకు ప్రేరణ. ప్రజలతో కలిసి పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ప్రతిక్షణం కృషి చేస్తాను. కార్యకర్తలు, ప్రజల మద్దతే నా నిజమైన బలం” అని అన్నారు.


