ఓట్ చోరీ కి వ్యతిరేకంగా సంతకాల సేకరణ
1 min read
ఎమ్మిగనూరు న్యూస్ నేడు : ఎమ్మిగనూరు పట్టణంలో సోమప్ప సర్కిల్ మరియు మున్సిపల్ కార్యాలయంకు ఎదురుగా పలు ప్రాంతాలలో ఎమ్మిగనూరు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ కాసిం వల్లి ఆధ్వర్యంలో ఓట్ చోరీ కి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .అనంతరం ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఓట్ చోరీ కి పాల్పడి కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చింది.బిజెపి ఎలా ఓట్ చోరీ చేసిందో ప్రజలకు మనం వివరించాలి ప్రతి గ్రామం నుంచి వందల పైగా సంతకాల సేకరించాలి.రానున్న ఎలక్షన్ లో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రిని చెయ్యాలని తెలియజేశారు. దేశంలోని ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ వస్తేనే పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఆసిఫ్, భాస్కర్ రమేష్ పాల్గొన్నారు.

