NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వన్య ప్రాణుల వృద్ధి అటవీ సంరక్షణ జాస్తీ..                            

1 min read

వెలుగోడు, న్యూస్​ నేడు :     వన్య ప్రాణుల సంరక్షణ వల్ల అడవి అభివృద్ధి చెందుతుందనడం లో అతిశయోక్తి లేదని, కావున ప్రతి ఒక్కరూ వన్య ప్రాణులను వేటాడడం మాని సంరక్షణ చేయడం చేయాలని వెలుగోడు రేంజి ఇంచార్జి అధికారి తాహిర్ అన్నారు. అటవీ డివిజన్ లోని గుండం మల్లి బేస్ క్యాంప్ లో మంగళవారం వన్య ప్రాణి వారోత్సవాలను నిర్వహించారు. వన్య ప్రాణులను వేటాడే వారి వివరాలు అటవీ అధికారులకు చెబితే వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని చెప్పారు. అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్ మొదలగు వ్యర్థ పదార్థాలను వేయడం వల్ల వన్య ప్రాణులకు ముప్పు ఏర్పడుతుందని, అలాచేసిన వారిపై చర్యలు తీసుకుంటా మన్నారు.వెలుగోడు పట్టణ అటవీ అధికారి గోపి తదితరులు పాల్గొన్నారు.

About Author