పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం వెంకట్రామయ్య మృతదేహం వద్ద శ్రీశైల నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి నివాళులర్పించారు. అనారోగ్యంతో బాధపడుతూ గత రెండు రోజుల క్రితం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.విషయం తెలుసుకున్న శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి హుటావుటిన బయలుదేరి పార్తివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాడా సానుభూతి తెలిపి దైర్యంగా ఉండాలని తెలిపారు. కుటుంబానికి ఏ అవసరం వచ్చినా ఆదుకుంటామని బరోసానిచ్చారు.వీరితో పాట కెసి కెనాల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి, మండల పార్టీ కన్వీనర్ కంచర్ల శివశంకర్ చౌదరి, మహానంది దేవస్థానం మాజీ చైర్మన్ సురేష్ రెడ్డి,మండల ,క్రాంతి కుమార్ యాదవ్,ఉల్లి మధు,కేశాలు, మారెడ్డి జయరామ్, సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు రాముడు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


