టపాసులు అమ్మితే చర్యలు తప్పవ్:డీఎస్పీ
1 min read

తప్పనిసరిగా నియమాలు పాటించాలి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిల్వ ఉంచినా విక్రయించినా చర్యలు తప్పవని ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ అన్నారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగాదుకాణదారులు ప్రభుత్వ నియమాలను తప్పనిసరిగా పాటించాలని నియమాలను ఉల్లంఘించిన దుకాణ నిర్వాహకులపై చర్యలు తప్పవన్నారు.నిబంధనలకు విరుద్ధంగా విక్రయించిన వారిపై ప్రేలుడు పదార్థాల చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.ఎక్కువగా క్రాకర్స్ నిల్వలు ఉంచినా వాటిపై ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా లేదా అనేది పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని,టపాకాయలు విక్రయదారులు జనసంచారం ఉన్న ప్రదేశాల్లో ప్రజల నివాస ప్రాంతాల్లో టపాకాయలు విక్రయించరాదని ఎవరైనా టపాకాయలు అమ్మినట్లయితే 112 లేదా పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ అన్నారు.

