కల్లు దుకాణాల్లో నియమాలు పాటించకపోతే చర్యలు..
1 min read

ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు..
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని షికారి పేటలో నిల్వ ఉంచిన నాటు సారాను ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు.కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ పి శ్రీదేవి, కర్నూలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ హనుమంత రావు మరియు నంద్యాల జిల్లా అధికారి ఎస్.రవికుమార్ ఆదేశాల మేరకు కర్నూల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారంషికారి కాలనీలో ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో 220 లీటర్లు బెల్లం ఊటను మరియు 10 లీటర్ల నాటు సారాయిని అక్కడే ధ్వంసం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. అదేవిధంగా పట్టణంలో బ్రాందీ షాపులు మరియు కల్లు అంగళ్లను తనిఖీ చేసి లైసెన్స్ దారులతో సమావేశం ఏర్పాటు చేసి బ్రాందీ మరియు కల్లు దుకాణదారులు పాటించాల్సిన నియమ నిబంధనలను గురించి ఎక్సైజ్ పోలీసులు అవగాహన కల్పించారు.నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కర్నూలు ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్సై మారుతి ప్రసాద్,ఎస్ఐ జఫురుల్లా,కృపావర కుమారి, పద్మనాభం,రామాంజనేయులు,డి మధుసూదన్,ప్రసాద్, శ్వేతారాణి రమీజాబి,అల్లా స్వామి,జయచంద్రుడు మధుసూదన్ రెడ్డిపాల్గొన్నారు.

