NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేద్దాం…

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: సూపర్ జీఎస్టీ సూపర్ సేవ్ కార్యక్రమానికి ప్రధానమంత్రి  నరేంద్ర మోడి   మరియు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్  విచేస్తున్న సందర్బంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కేడీసీసీబీ చేర్మెన్ శ్రీ డి విష్ణువర్ధన్ రెడ్డి  మరియు కోడుమూరు ఎమ్మెల్యే శ్రీ బొగ్గుల దస్తగిరి ల కోడుమూరు  నుంచి భారీ జన సమీకరణలో  భాగంగా కర్నూలు మండలం ఈ తాండ్రపాడు పంచలింగాల గొందిపర్ల గ్రామాల ప్రజలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సమావేశం లొ  డి విష్ణువర్ధన్ రెడ్డి , బొగ్గుల దస్తగిరి లు మాట్లాడుతూ ప్రోగ్రామ్ కు భారీ ఎత్తున్న కదలి రావాలని కోడుమూరు నియోజకవర్గం నుంచి 50వేల మంది ఖచ్చితంగా రావాలని అప్పుడే మన సమస్య లు తొందరగా తీర్చుకోవడానికి సమయం ఇదే అని వారు పిలుపునిచ్చారు మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలంటే అందరు దయచేసి ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఆ గ్రామాలనుంచి విచ్చేసిన సర్పంచ్ లు మరియు ముఖ్యమైన నాయకులు మహిళలు స్వచ్చందంగా మా గ్రామాలనుంచి భారీ ఎత్తున పాల్గొంటామని వారు భరోసానిచ్చారు.

About Author