మంత్రిని కలిసిన టీడీపీ సీనియర్ నాయకుడు ఈడిగ గోవింద్ గౌడ్
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరులో టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూటమి నాయకుల సమన్వయ కమిటీకి విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ, ఆర్థిక బలహీన వర్గాల, చేనేత మరియు జోళి శాఖ మంత్రి సవిత ని, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ ని ,రాష్ట్ర వాల్మీకికార్పొరేషన్ చైర్మన్ కపట్రాల బొజ్జమ్మ ని మర్యాద పూర్వకంగా కలిసినట్లు హొళగుంద టీడీపీ సీనియర్ నాయకుడు ఈడిగ గో.వింద్ గౌడ్ మంగళవారం తెలిపారు. మంత్రిని, కూటమి నాయకులను శాలువ వేసి పూలమాల తో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో వీరన్న గౌడ, ఈడిగ రాజేంద్ర గౌడ్,బిజె పోంపాపతి, దుబ్బ ఎర్రిస్వామి, దిడ్డి వెంకటేష్, దిడ్డి నాగప్ప, పాల్గొన్నారు.

