NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన ఉపాధ్యాయులు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల ఆనందం వ్యక్తం

1 min read

హొళగుంద న్యూస్ నేడు : విద్యా కమిటీ చైర్మన్ బోయ రాము ఆధ్వర్యంలో పాఠశాలకు నూతనంగా ఉపాధ్యాయులు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా  ఉపాధ్యాయ ఉపాధ్యాయురాలకు  ప్రధానోపాధ్యాయుడిగా రవి నాయక్ ఉపాధ్యాయురాలుగా హనుమమ్మ శంకరి భాయ్ లకు పువ్వులు జల్లుతూ శాలువా పూలమాలతో సత్కరించి పాఠశాలల్లోకి ఘనంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్య కమిటీ చైర్మన్ బోయ రాము ఫీల్డ్ అసిస్టెంట్ పి.శ్రీరంగ కె.మల్లయ్య మాట్లాడుతూ నూతన ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఉపాధ్యాయులకు  అభినందనలు తెలుపుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించి బావి భారత పౌరులుగా తీర్చిదిద్ది విద్యార్థిని విద్యార్థినీయులను ఉన్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చెయ్యాలని వారు అన్నార. గతంలో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు విద్య చాలా కష్టమయ్యేది అని వారు తెలియజేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మా పాఠశాలకు తగిన ఉపాధ్యాయులను నియమించింది కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును  పాఠశాలకు గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అని వారు అన్నారు. పెద్దహ్యట ప్రాథమిక పాఠశాలకు ముగ్గురు ఉపాధ్యాయులను  నియమించినందుకు కూటమి ప్రభుత్వానికి  విద్యార్థినీ విద్యార్థినిలు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో  బి.కె.వీరేష్ హెచ్.వీరభద్ర వార్త విలేకర్ విరుపాక్షి హెచ్.సోమశేఖర్ గౌడ్ మల్లికార్జున పంపయ్య స్వామి తమన్న శ్రీకాంత్ అడివప్ప ఈరన్న అంగన్వాడి టీచర్ మేనకరాణి ఆయా లక్ష్మీ వంట ఏజెన్సీ లక్ష్మి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author