NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమిష్టి కృషివల్లే రాష్ట్రానికి గూగుల్ రాక.. అందరం గర్వపడాల్సిన సమయం

1 min read

20లక్షల ఉద్యోగాల సాధనకు కట్టుబడి నిరంతరం శ్రమిస్తున్నాం

ఇకపై ప్రాజెక్టులకు సంబంధించి ప్రతివారం ఎనౌన్స్ మెంట్లు ఉంటాయి

17నెలల్లో ఇన్వెస్టిమెంట్ ఎట్రాక్ట్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ ను తయారుచేశాం

గూగుల్ వాళ్లకు కూడా రాష్ట్రానికి రావద్దని మెయిళ్లు పెట్టారు….

వైసిపి రాష్ట్రానికి హానికరం… వారి వల్ల అంతా విధ్వంసమే

విలేకరుల సమావేశంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

అమరావతి, న్యూస్​ నేడు  : చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా కేవలం చంద్రబాబునాయుడు వల్లే సాధ్యమని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ఉండవల్లి నివాసంలో బుధవారం ఉదయం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… చంద్రబాబుగారు 2014-19 నడుమ ఇండియా లార్జెస్ట్ ఆటోమోటివ్ ఎఫ్ డిఐ కియా తెచ్చారు. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తున్నాం. ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్ డిఐ ఇన్వెస్టిమెంట్ ఇన్ హిస్టరీ,  ఎపిలో గూగుల్ 15బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది. అమెరికా వెలుపల గూగుల్ లార్జెస్ట్ డేటా సెంటర్ ఇది. అనేక దేశాలు, రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఎపికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ వల్ల పెట్టుబడి పెట్టగలం, ఇబ్బంది ఉండదని గ్రహించి వారు రాష్ట్రానికి వచ్చారు. గూగుల్ రాక ఎపి గెలుపు కాదు, భారతదేశం గెలిచింది. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చినవిధంగానే… ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చబోతోంది. ఇది కేవలం ఒక్క డాటా సెంటర్ గురించి మాత్రమే కాదు. కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, రెన్యువబుల్ ఎనర్జీ, ఎఐకి సంబంధించి అనేక అనుబంధ కంపెనీలు విశాఖకు వస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం దీనిద్వారా 25రెట్ల ఆర్థిక ప్రభావం ఉంటుంది. అలాంటి ఎకనమిక్ యాక్టివిటీ గూగుల్ చేయబోతోంది. ఈ ఒక్క పెట్టుబడివల్ల 1,88,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థపై అయిదేళ్లలో రూ.48వేలకోట్ల ప్రభావం చూపుతుంది. గూగుల్ కోసం చట్టాల్లో సవరణలు చేశాం.

చంద్రబాబు విజన్ తోనే పెట్టుబడుల రాక

విలేకరుల ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ… విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రత్యేక కారిడార్ ఏర్పాటుచేశాం. గూగుల్ డాటా సెంటర్ భారీఎత్తున బహుళ ఆర్థిక ప్రభావం చూపుతుంది. ఈ ప్రభావం 25రెట్లవరకు ఉండవచ్చని అంచనా. విజనరీ లీడర్ వల్లే ఇది సాధ్యమైంది. మేము టిసిఎస్, కాగ్నిజెంట్ లకు మాత్రమే ఎకరా రూపాయికి భూములిచ్చాం. ఇంకెవరికైనా ఇచ్చామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కౌన్సిల్ లో చాలెంజ్ చేశా.టిసిఎస్ క్యాంపస్, డిసెంబర్ కాగ్నిజెంట్ విశాఖకు వస్తున్నాయి. నిరంతర ఫాలో అప్ తోనే ఇది సాధ్యమవుతోంది.సంస్కరణల అమలుతో యూనిట్ 13పైసలు తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు రూ.800 కోట్లు లబ్ధి చేకూరింది. ఇంకా విద్యుత్ చార్జీలు తగ్గుతాయి. టాలెంటెడ్ యూత్, ట్రాక్ రికార్డు గల ముఖ్యమంత్రి, చౌకధరతో రెన్యువబుల్ ఎనర్జీ మా ప్రత్యేకతలు.వైసిపి ఆంధ్రరాష్ట్ర ఆరోగ్యానికి హానికరం. అయిదేళ్ల వైసిపి పాలనలో తీవ్రంగా నష్టపోయాం. సానుకూల దృక్పథంతో మేం ముందుకెళ్తున్నాం. వైసిపి నాయకులకు తెలిసిన పరిశ్రమలు ఉన్నా ఆహ్వానిస్తాం. మంచి కంపెనీలు ఉంటే రప్పించి ఆ  క్రెడిట్ మీరే తీసుకోండి. దీనివల్ల ఆంధ్రరాష్ట్రం గెలుస్తుంది. ప్రాంతీయ విద్వేషాలు, కులాల మధ్య చిచ్చుపెడితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు  ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు.

About Author