‘హ్యాండ్స్’ పై.. ఆరోపణలు పట్టించుకోరా…!
1 min readసేవ ముసుగులో… కోట్ల రూపాయలు దోపిడి…
- సిబ్బంది జీతం నుంచి రూ. 3 వేలు వసూలు
- విదేశీ నిధులు… దాతలతో విరాళాలు స్వాహా..
- హెచ్ఐవి పై అవగాహన సదస్సులు లేవు..
- అద్దె కార్యాలయాలు, సిబ్బంది జీతాలంటూ ప్రభుత్వ సొమ్మను దోచుకుంటున్న సంస్థ
- పత్తికొండ, నందికొట్కూరు, డోన్‌లో సేవలు నిల్…
- ఉన్నతాధికారులకు ఫిర్యాదులు.. వచ్చినా…
- పీఎం ప్రధాని సభ ముందు డోన్‌లో అత్యవసర కార్యాలయం మార్పు…
- సేవ చేస్తున్నామంటూ… ఉన్నతాధికారులకు తెలిసేలా ప్రయత్నం…
- ఆరు నెలలుగా యాక్టివిటిలో లేదన్న జిల్లా క్షయనివారణ అధికారి
కర్నూలు బ్యూరో, న్యూస్ నేడు: ప్రజలకు సేవ చేస్తామంటూ ప్రభుత్వ అనుమతి పొందిన హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ .. సేవ ముసుగులో దోపిడీ చేస్తోంది. వైద్యశాఖకు అనుబంధంగా ఉంటూ సేవ చేస్తామన్న ఎన్జీఓ .. హెచ్ఐవి బాధితులకు అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ డోన్, నందికొట్కూరు, పత్తికొండ, గుత్తిలో సేవకు అనుమతి పొందిన హ్యాండ్స్ నిర్వాహకులు ఏడాదికోసారి ర్యాలీ చేస్తూ…. పబ్బం గడిపేస్తున్నారు. అంతేకాక ఆయా ప్రాంతాల్లో హ్యాండ్స్ కార్యాలయాలకు అనుమతి పొంది.. వాటి నెలసరి అద్దె డబ్బును నేరుగా ఎన్జీఓ నిర్వాహకుడి అకౌంట్లోకి పడుతుందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ పై సిబ్బంది, ప్రజలు ఆరోపణలు చేయడంతో ఇటీవల పత్తికొండ, డోన్‌లో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో పలు విషయాలపై ఆరా తీశారు. కానీ ఆ వివరాలు బయటకు రాక మునుపే ఉన్నతాధికారులను మ్యానేజ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
డోన్‌లో అత్యవసర కార్యాలయం..
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ ఈ నెల 16న కర్నూలులో జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వచ్ఛంద సేవా సంస్థ హ్యాండ్స్ అత్యవసరంగా డోన్ కార్యాలయాన్ని వేరే ప్రాంతంలో ఏర్పాటు చేసి… సేవలు చేస్తున్నామని అధికారులకు తెలియజేయాలని విశ్వప్రయత్నం చేశారు. ఇప్పటికే సిబ్బందిలో జీతాలు, దాతలతో విరాళాలు, విదేశీ నుంచి వచ్చిన నిధులను పక్కదోవ పట్టించారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. అంతేకాక కొందరి సిబ్బందిని లైంగికంగా వేధించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
హ్యాండ్స్ లైసెన్స్ ను రద్దు చేయండి..
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ లైసెన్స్ రద్దు చేయాలని కర్నూలు జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఈ సంస్థ అనంతపురంలోని గుత్తిలో కూడా అనుమతి తీసుకున్నా… అక్కడ హెచ్ఐవి సంబంధించిన సేవలు చేయలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాక ఇటీవల ఆ సంస్థ అనంతపురంలోని అగ్రికల్చర్ లో మొక్కలు, పంటల సాగుకు సంబంధించి స్పేర్ పార్ట్స్ ను ప్రభుత్వానికి టెండరు ద్వారా విక్రయించేలా అనుమతి పొందింది. ఈ క్రమంలో కర్నూలులోని హెచ్ ఐ వి కి సంబంధించిన లైసెన్స్ ను రద్దు చేసి.. కొత్త వారికి ఇస్తే బాగుంటుందని కర్నూలు జిల్లా ప్రజలు కోరుతున్నారు.

