NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపీలో హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి సహకారం అందించండి

1 min read

క్రికెట్, హాకీల్లో ఉమ్మడి శిక్షణా శిబిరాలు, ఫ్రెండ్లీ మ్యాచ్ లు నిర్వహించండి

విక్టోరియా టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్ తో లోకేష్ భేటీ

ఆస్ట్రేలియా (మెల్‌బోర్న్) న్యూస్​ నేడు   : విక్టోరియా రాష్ట్ర పర్యావరణ, టూరిజం, స్పోర్ట్స్ శాఖల మంత్రి స్టీవ్ డిమోపౌలోస్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మెల్‌బోర్న్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… వారసత్వ పర్యాటకంలో విక్టోరియా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ లో పాపికొండలు, విశాఖ బీచ్ వంటి సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. గ్రేట్ ఓషన్ రోడ్ తరహా పర్యావరణ బ్రాండింగ్ కు విక్టోరియా నైపుణ్యాన్ని ఏపీకి అందించండి. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖతో కలిసి హెరిటేజ్ టూరిజం, మార్కెటింగ్, ఎకో సర్టిఫికేషన్ పై కలిసి పనిచేయండి. ఆంధ్రప్రదేశ్ లో 1053 కి.మీ.ల సువిశాల తీరం ఉంది. విక్టోరియా పోర్టు ఫిలిప్ బే ప్రాజెక్టు తరహాలో వాతావరణ సాంకేతికతను ఉపయోగించి ఏపీలో తీరప్రాంత స్థితిస్థాపకతపై ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి (ఆర్ & డి) కార్యక్రమాలు చేపట్టండి. విక్టోరియా అడ్వెంచర్ టూరిజం గవర్నెన్స్ (ఆల్పిన్ నేషనల్ పార్క్) తరహాలో ఆంధ్రప్రదేశ్ లోని అరకు (ట్రెక్కింగ్), పులికాట్ (వాటర్ స్పోర్ట్స్) అభివృద్ధికి చేయూతనివ్వండి. విక్టోరియా సంస్థల ద్వారా అడ్వెంచర్ గైడ్స్/ రేంజర్ల సర్టిఫికేషన్, నైపుణ్యాభివృద్ధికి సహకారం అందించండి. విక్టోరియాలోని ఆఫ్ షోర్ విండ్, సోలార్ రెన్యువబుల్ ప్రాజెక్టులు విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీలో యువతకు గ్రీన్ జాబ్స్ పై స్కిల్ డెవలప్ మంట్ కార్యక్రమాలకు సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

About Author