NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ..

1 min read

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే..

నందికొట్కూరు , న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు అయిన చెక్కును కాతా రాజేశ్వర్ రెడ్డికి 1,83,832 రూ.ల చెక్కును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య లబ్ధిదారుడికి శుక్రవారం వారి ఇంటికి వెళ్లి అందజేశారు.నందికొట్కూరులో జరిగిన పలనందికొట్కూరులో జరిగిన పలు వివాహ కార్యక్రమాలకు ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.తర్వాత అల్లూరు గ్రామంలో గని సాలమ్మ మరియు కోనేటమ్మ పల్లిలో బోరెల్లి నాగరాజు వీరు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారికి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి,మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గుండం రమణారెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి,జలకనూరు సర్పంచ్ కురువ ఎల్లయ్య, కృష్ణారెడ్డి,దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

About Author