కల్తీ మద్యానికి పర్మనెంట్ కేరాఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి
1 min read

కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు చేపడుతున్న ఎక్సైజ్ శాఖ
ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా కల్తీ మద్యం చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు
యాప్ ద్వారా మద్యం వినియోగదారులకు అరచేతిలోనే సమాచారం
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి
ఏలూరు, న్యూస్ నేడు: కల్తీ మద్యానికి కేరాఫ్ పర్మినెంట్ అడ్రస్ జగన్ రెడ్డి అని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు యాప్ ద్వారా మద్యం వినియోగదారులకు చేపడుతున్నారు అన్నారు. యాప్ ద్వారా మద్యం వినియోగదారులకు అరచేతిలోనే సమాచారం అందించే విధానం ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్యే చింతమనేని అన్నారు. పెదపాడు మండలం పెదపాడు గ్రామంలోని మద్యం దుకాణం వద్ద కూటమి ప్రభుత్వం ప్రారంభించిన ఏపీ ఎక్సైజ్ సురక్షయాప్ పై గురువారం సాయంత్రం మద్యం వినియోగదారులకుదెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అవగాహన కల్పించారు.మద్యం కుంభకోణంలో డీకార్డ్ లాజిస్టిక్స్ ఖాతా నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి (ఎండీగా పెద్ది రెడ్డి స్వర్ణలత- మిథున్ రెడ్డి తల్లి) రూ.5కోట్లు జమైనట్లు సిట్ తెల్చిందన్నరు.ఆఫ్రికా దేశాల్లో కల్తీ వ్యాపారాల అనుభవంతో జగన్ పాలనలో విషపూరిత మద్యంతో రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డారు.వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి 2013లో ఆఫ్రికాలోని కామెరూన్ లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరుతో కల్తీ మద్యం వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా. కల్తీ మద్యం జరిగిందని అక్కడ స్వయంగా అక్కడ మంత్రి ఆ కంపెనీని సీజ్ చేసిన మాట వాస్తవ కాదా. సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి జగన్ రెడ్డి బినామీలు కాదా అన్నారు. టాంజానియా, ఐవరీకోస్ట్, ఘనా, జాంబియా, మొజాంబిక్ దేశాల్లో మీ సన్నిహితులు మద్యం వ్యాపారం చేసిన మాట వాస్తవం కాదా.ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసులు తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలపై ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది.విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరులో నూతన పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి మద్యాన్ని పరీక్షించి కల్తీని నివారించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఈఎన్ఏని 13 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం. మద్యం ఏ స్థాయిలో కూడా కల్తీ అయ్యేందుకు ఆస్కారం లేకుండా డిస్టిలరీలు, డిపోలు, మద్యం షాపులు, బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, శాంపిళ్లను సేకరించి పరీక్షించడం జరుగుతోందని ఎమ్మెల్యే చింతమనేని పేర్కొన్నారు.


