NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

లింగపాలెం మండలంలో జడ్పీ సీఈవో సుడిగాలి పర్యటన

1 min read

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది

 అధికారులు అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్య పనులను పరివేక్షించాలి

 ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో శుక్రవారం జడ్పి సీఈవో కె.శ్రీహరి సుడిగాలి పర్యటన చేశారు. మండల డిప్యూటీ ఎంపీడీవో సుందరి, సెక్రెటరీ సుగుణ రాజు, సింగ గూడెం సెక్రెటరీ రాజు, ఎం ఆర్ సి ప్రభుదాసు ఆధ్వర్యంలో లింగపాలెం గ్రామంలో కుమ్మర్ల బజార్లో గార్బేజ్ చెత్తను పారిశుద్ధ్య కార్మికుల ద్వారా సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించారు. అలాగే ఎస్ డబ్ల్యు ఎం షెడ్డు,ను మరియు రోడ్లకు ఇరువైపులు ఉన్న చెత్తను తొలగించి  పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని, గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడ చెత్తాచెదారాలను నిలువ ఉంచరాదని సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని జడ్పీ సీఈవో  సూచించారు.

About Author