ఎమ్మిగనూరు నవోదయ కోచింగ్ సెంటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్
1 min read

విద్యార్థి సంఘాల ఫిర్యాదు మేరకు పది రోజుల్లో కోచింగ్ సెంటర్లు ను మూసివేస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ సిరి
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి నవోదయ కోచింగ్ సెంటర్లపై విచారణ జరిగి నెలలు గడుస్తున్న పట్టించుకోని డిఇఓ పై చర్యలు తీసుకుని నవోదయ కోచింగ్ సెంటర్లను మూసివేయాలంటూ ఈరోజు విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కర్నూల్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కావున కలెక్టర్ గారు దీనికి స్పందించి డీఈఓ ని పిలిచి ఆయన పైన ఆగ్రహానికి గురి కావడం జరిగింది మీరు పది రోజుల్లో గా ఆ నవోదయ కోచింగ్ సెంటర్లలో ఎంతమందివిద్యార్థులు ఉన్నారో వారు ఏ ఏ పాఠశాలలో చదువుతున్నారో ఆయా పాఠశాల హెచ్ఎం లకు ఎంఈఓ ల ద్వారా నోటీసులు జారీ చేయమని అదేవిధంగా అక్రమంగా నడుపుతున్న ఆ కోచింగ్ సెంటర్ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయమని ఆమె ఆదేశించడం జరిగింది. ఇకనైనా అధికారులు స్పందించి ఈ కోచింగ్ సెంటర్ల దందాను మరియు కోచింగ్ సెంటర్లను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు పూనుకుంటామని వారు హెచ్చరించారు.

