NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనలను మానుకోవాలి

1 min read

వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ

వైఎస్ఆర్సిపి నియోజకవర్గ విద్యార్థి విద్యార్థి విభాగమ అధ్యక్షులు సాయి కుమార్ రెడ్డి

చెన్నూరు ,న్యూస్ నేడు:   వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైద్య విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు వెసులుబాటుగా అన్ని నిబంధనల మేరకు 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను చేపట్టడం జరిగిందని వైయస్ఆర్సీపీ కమలాపురం నియోజకవర్గ విద్యార్థి విభాగమ అధ్యక్షులు గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర పిలుపుమేరకు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోచం రెడ్డి నరేన్ రామాంజులరెడ్డి ఆదేశాలను సారంగా చెన్నూరు టౌన్ రెండవ ఎంపీటీసీ సెగ్మెంట్ (పార్కు వీధి) నందు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకై వ్యతిరేకంగా సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వైఎస్ఆర్సిపి కమలాపురం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల్లా సాయికుమార్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా గుమ్మల్ల సాయికుమార్ రెడ్డి మాట్లాడుతూ, పేద వైద్య విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, 8,480 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీల నిర్మాణాలకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. ఇందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తికాగా, మిగతా కాలేజీలు వివిధ దశలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఇందులో భాగంగా 2023- 2024 సంవత్సరాలకు గాను ఐదు కాలేజీలకు గాను 750 ఎంబీబీఎస్ సీట్లను తీసుకురావడం జరిగిందన్నారు. ఇదంతా కూడా పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించుకునేందుకు వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం పెద్దఎత్తున సంకల్పించడం జరిగిందన్నారు. అందుకు తగ్గట్టు వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలను తలపెట్టి పేద వైద్య విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలవడం జరిగిందన్నారు. అలాంటి సంకల్పానికి తోడుగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయాన్ని తుంగలో తొక్కి వాటిని ప్రైవేటీకరణ చేయాలని భావించడం ఎంతో దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ అల్లి శ్రీరామమూర్తి, గుమ్మల్ల శివారెడ్డి, గుమ్మల్ల మధుసూదన్ రెడ్డి, శ్రీనివాసరాజు, టి ఎన్ చంద్ర రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, కేశవరెడ్డి, మునెయ్య, శ్రీనివాసులు రెడ్డి సీతారామయ్య,  వారిష్, రామాంజనేయులు కృష్ణ సత్య రాజు, నిత్య పూజ, పెద్ద ఎత్తున వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

About Author