NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వన సంరక్షణ సమితి ఎన్నిక ఏకగ్రీవం..

1 min read

మహానంది, న్యూస్​ నేడు: మహానందిలో సోమవారం మహానంది సర్పంచ్ చలం చలం శిరీష అధ్యక్షతన జరిగిన వన సంరక్షణ సమితి కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయింది. డీఎఫ్ఓ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు ఎఫ్ ఆర్ వో నాజిర్జా ఆధ్వర్యంలో మహానందిలో ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా చలం చలం తిరుపతి తో పాటు ఉపాధ్యక్షురాలుగా మండ్ల పాములేటమ్మ మరో 13 మంది కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు డిఆర్ఓ హైమావతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వన సంరక్షణలో భాగం కావాలని అడవులను కాపాడడంతో పాటు వన్నె మృగాలను వేటాడి వాటి మాంసాన్ని క్రయవిక్రయాలు జరపకుండా నిరోధించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని డిఆర్ఓ హైమావతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భాస్కర్ ఎఫ్ బి ఓ ప్రతాప్ గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author