కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో డాక్టర్స్ కాఫీ క్లబ్ ప్రారంభం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు:కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఓల్డ్ లెక్చరర్ గ్యాలరీ నందు వైద్యుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన డాక్టర్స్ కాఫీ క్లబ్ ను ఆసుపత్రి సూపరిండెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు మరియు కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.చిట్టి నరసమ్మగారు ముఖ్య అతిథులుగా హాజరై కాఫీ క్లబ్‌ను ప్రారంభించారు.ఆసుపత్రి సూపరిండెండెంట్, డా. కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ :- ఈ క్లబ్ ద్వారా వైద్యులు, పీజీ వైద్య విద్యార్థులు రోజువారీ వైద్య సేవల నడుమ కొంత విశ్రాంతి తీసుకొని స్నేహపూర్వక వాతావరణంలో ఆలోచనలు పంచుకునేందుకు, అనుభవాలను చర్చించేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు వైద్యుల కోసం అందమైన వాతావరణంలో కాఫీ క్లబ్ సదుపాయం ఏర్పాటు చేయడం పట్ల ఏపీ జి డి ఏ అసోసియేషన్ వైద్యులందరూ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కేఎంసి వైస్ ప్రిన్సిపాల్, డా.సాయి సుధీర్ ఆసుపత్రి ఇంచార్జ్ సిఎస్ఆర్ఎంఓ, డా.వెంకటరమణ, ఏ పీ జి డి అసోసియేషన్ ప్రెసిడెంట్, డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్, డా.నాగేశ్వరరావు, డా.విజయ్ శంకర్, డా.ధమామ్ శ్రీనివాసులు, డా.రామ్ శివనాయక్, డా.రామకృష్ణ నాయక్, డా.మహేశ్వర్ రెడ్డి, డా.ప్రశాంత్, పీజీలు తదితరులు పాల్గొన్నారు.

