ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలి
1 min read
పీజీ ఆర్ ఎస్ ఫిర్యాదులను నాణ్యతతో పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు: ఇళ్ళ నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి హౌసింగ్, పిజిఆర్ఎస్ తదితర అంశాలపై మండల స్పెషల్ ఆఫీసర్లు, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ళ నిర్మాణాలు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు..ఏదైనా మండలంలో ఇళ్ళ నిర్మాణాలు సక్రమంగా జరగకుంటే, సంబంధిత మండలాలకు వెళ్ళి పనులు ఎందుకు జరగడం లేదు, సమస్య ఏంటి అని పరిశీలించి, సమస్యను పరిష్కరించి పురోగతి తీసుకొని వచ్చే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, హౌసింగ్ పిడి చిరంజీవి, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

