ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం – అక్టోబర్ 29
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఈ సంవత్సరం స్ట్రోక్ దినోత్సవం సందేశం: ప్రతి సెకను విలువైనది – స్ట్రోక్ గుర్తించండి, వెంటనే చర్య తీసుకోండి. ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం జరుపుకుంటారు. స్ట్రోక్ అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ప్రాణాంతక వ్యాధి. మన దేశంలో కూడా ప్రతి నిమిషం ఒక్కరికి స్ట్రోక్ వస్తుందని, అందులో చాలామంది తక్షణ చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారని నిపుణులు చెబుతున్నారు.డా. రఘు నందిని – న్యూరోఫిజిషన్, మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ మాట్లాడుతూ –“స్ట్రోక్ అనేది మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోయినప్పుడు లేదా రక్తస్రావం జరిగేటప్పుడు సంభవిస్తుంది. ఫలితంగా మెదడు కణాలు చనిపోతాయి. ముఖం వంకరపోవడం, చేతులు లేదా కాళ్లు బలహీనపడడం, మాటలు రాకపోవడం వంటి లక్షణాలు కనబడితే వెంటనే ఆసుపత్రికి రావాలి. టైమ్ ఈజ్ బ్రెయిన్ – ప్రతి నిమిషం విలువైనది,” అని అన్నారు.క్లస్టర్ హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ “స్ట్రోక్ పై సమాజంలో అవగాహన పెంచడం అత్యంత అవసరం. ప్రతి కుటుంబం స్ట్రోక్ లక్షణాలను గుర్తించి వెంటనే వైద్య సహాయం పొందాలి. ఆలస్యం ప్రాణహానికి దారితీస్తుంది. మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ లో అత్యాధునిక న్యూరో కేర్ యూనిట్ 24 గంటలూ అందుబాటులో ఉంది. నిపుణులైన వైద్యులు, అత్యాధునిక పరికరాలు, మరియు ఎమర్జెన్సీ సదుపాయాలతో మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం,” అని అన్నారు.ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించి, స్ట్రోక్ ముప్పు నుంచి దూరంగా ఉండాలని నిపుణులు సూచించారు.

