NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి కార్తీక దీపోత్సవం

1 min read

హొళగుంద న్యూస్ నేడు :  మండలంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కృష్ణమూర్తి శెట్టి ఆధ్వర్యంలో మండల ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు వాసవి కన్యకా పరమేశ్వరి కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత ఆలయంలో మండల ఆర్యవైశ్య మహిళా సభ్యులు, చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చి దీపాలతో వాసవి కన్యకా పరమేశ్వరుని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో భాగంగా వాసవి కన్యకా పరమేశ్వరుని పలువురు మహిళలు దర్శించుకుని తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మండల సంఘం నాయకులు మహిళలు, యువకులు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author