సోమవారం కురిసిన వర్షానికి నెలకొరిగిన వరి పంట
1 min read

వర్షానికి దెబ్బతిన్న పత్తి
హొళగుందలో పెద్దకొండను కమ్ముకున్న పొగమంచు
హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద మెంత తుఫాన్ కారణంగా మండల కేంద్రం హొళగుందతో పాటు తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ) వరివాహక గ్రామాలైన హెబ్బటం గజ్జహళ్లి, వందవాగిలి, పెద్దగోనెహాశ్, ఇంగళదహాశ్, కోగిలతోట, సమ్మతగేరి తదితర గ్రామాల పరిధిలో సాగు చేసిన పంటలు చేతికందే దశలో ఉండగ సోమవారం కురిసిన వర్షానికి వేలాది ఎకరాలో వరి పంట నేలకొరిగింది. గాలికి పైరు నెలకొరిగి గింజలు నేల పాలయ్యాయి. ఎకరాకు దాదాపు రూ.30 వేలు వరకు పెట్టుబడులు పెట్టి వంటలు సాగు చేసామని పైరు నెలకొరగడం వల్ల గింజలు రాలి దిగుబడి తగ్గే సూచనాలు కనబడ్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే అతివృష్టి వల్ల మెట్టభూముల్లో వత్తి, మిరప తదితర వంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు ఎల్లెల్సీ కింద సాగు చేసిన వరి వంట పై ఆశలు పెట్టుకున్నారు. అయితే దిగుబడి చేతికొచ్చే సమయంలో ఇలా కోతకు వచ్చిన పైరు నేల వాలుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సోమవారం కురిసిన వర్షం 12.2 మీ.మీగా నమోదైందీ.


