NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం – సదరం అప్పీల్ పునఃపరిశీలన క్యాంపులు వాయిదా

1 min read

నంద్యాల, న్యూస్​ నేడు: మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా ఈ నెల 29, 30, 31 తేదీలలో జరగాల్సిన పునఃపరిశీలన క్యాంపులు వాయిదా వేయబడినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, గడివేముల, గోస్పాడు, జూపాడుబంగ్లా, ఆత్మకూరు అర్బన్, బనగానపల్లి, బేతంచర్ల, చాగలమర్రి, డోన్, డోన్ అర్బన్, బండి ఆత్మకూరు మండలాల్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందజేయబడుతున్న సామాజిక భద్రతా మరియు వికలాంగుల పెన్షన్లకు సంబంధించిన సదరం అప్పీల్ పునఃపరిశీలన కొత్త తేదీలను త్వరలో మండల సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ లబ్ధిదారులకు నోటీసుల రూపంలో తెలియజేస్తామని ఆయన తెలిపారు. అందువల్ల, పై తేదీలలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరూ హాస్పిటల్ లేదా క్యాంపు ప్రాంగణాలకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తగిన చర్యలు తీసుకుని, సచివాలయ సిబ్బంది ద్వారా డిసేబుల్ పెన్షనర్లకు సమాచారం చేరేలా చూడాలని శ్రీధర్ రెడ్డి సూచించారు.

About Author