NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నియోజకవర్గ స్థాయి వ్యాసరచన  పోటీలో విజేత గా పెద్దకడుబూరు విద్యార్థి

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు  : నవంబర్ 2 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ స్థాయి లో జరిగిన వ్యాసరచన  పోటీలలో పెద్దకడబూరులోని జిల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సాలె రవీంద్ర మొదటి స్థానం కైవసం చేసుకొని విజేతగా నిలిచారని ఎంఈఓ 2 రాగన్న  గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని కౌతాళం , పెద్దకడబూరు, మంత్రాలయం ,కోసిగి పాఠశాలలోని మొత్తం 12 మంది విద్యార్థులు వ్యాసరచన , వక్తృత్యం , మరియు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగిందని , ఈ పోటీలో పెద్దకడుబూరలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సాలె వీరేంద్ర విజయం సాధించడం జరిగిందన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జూనియర్ కళాశాల అధ్యాపకులు మద్దిలేటి , మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  చిలకలడోణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శేఖర్ వ్యవహారించారు. వ్యాసరచన పోటీలో మొదటి స్థానం కైవసం చేసుకున్న విద్యార్థి సాలె వీరేంద్ర ను యంఈఓ 2 రాగన్న ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు  గోట్ల చంద్రశేఖర్  లు అభినందించారు. ఈ కార్యక్రమంలో  మాధవరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు బోజరాజ్ ,  ఉపాధ్యాయులు నల్లరెడ్డి ,  బసవరాజు , రామచంద్ర , నాగరాజు ,  సువర్ణ జోషి లు పాల్గొన్నారు.

About Author