శ్రీశైలంలో…31న కృష్ణమ్మ హారతి
1 min read
శ్రీశైలం, న్యూస్ నేడు: అక్టోబరు 22 నుంచి నవంబరు 21వతేదీ వరకు కార్తీకమాసోత్సవాలు నిర్వహింపబడనున్నాయి.ఈ సందర్భంగా కార్తీక రెండవ శుక్రవారం ( 31.10.2025) రోజు సాయంత్రం పాతాళగంగ వద్ద కృష్ణమ్మహారతి కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. . ఈ కార్యక్రమములో కృష్ణవేణినదీమతల్లికి పూజాదికాలు, సారె సమర్పణ, దశహారతులను నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కార్యక్రమములో భాగంగా పాతాళగంగ వద్ద నెలకొల్పబడిన కృష్ణవేణి నదీమతల్లి విగ్రహానికి పూజాదికాలు జరిపించబడుతాయి. ఈ హారతి కార్యక్రమునకు ముందు లోకకల్యాణాన్నికాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠిస్తారు.తరువాత కార్యక్రమము నిర్విఘ్నంగా జరగాలని ముందుగా మహాగణపతిపూజ జరిపించబడుతుంది. తరువాత పాతాళగంగ వద్ద నెలకొల్పబడిన కృష్ణవేణి నదీమతల్లికి పూజాదికాలు జరిపించబడుతాయి.సంప్రదాయాన్ని అనుసరించి నదీమతల్లికి ఏకహారతి, నేత్రహారతి, బిల్వహారతి, నాగహారతి, పంచహారతి, సద్యోజాతాది పంచహారతులు, కుంభహారతి, నక్షత్రహారతి, రథహారతి, కర్పూరహారతులు ఇవ్వబడుతాయి.ఈ కర్పూరహారతి దర్శనం వలన మనోదోషాలు తొలగిపోతాయి. భగవంతుని కరుణాకటాక్షాలు లభిస్తాయి.

