NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ ఐక్యత దినోత్సవం విజయవంతంగా నిర్వహణ

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు లోని డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం లో ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో “జాతీయ ఐక్యత దినోత్సవం (సర్దార్ వల్లభాయ్ పటేల్  150వ జన్మదినం) దినోత్సవం”ను జరుపుకోవటం జరిగినది. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్. షేక్ షా వలి ఖాన్  రిజిస్ట్రార్ ప్రొఫెసర్. వి. లోకానాథ్  మరియు ప్రిన్సిపాల్ డా. ఎస్. మహబూబ్ భాష సర్దార్ వల్లభాయ్ పటేల్  చిత్రపటంకు పూల మాల వేసారు.  తర్వాత రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రతిజ్ఞను చదివారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్. షేక్ షా వలి ఖాన్  మాట్లాడుతూ ఎందుకు నేషనల్ యూనిటీ డేను  జరుపుకోవాలి అని, దేశం కోసం ఒక మంచి విషన్ కలిగినటువంటి, మిలట్రీలో మంచి నాయకుడిగా, హైదరాబాద్ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేయటంలో, దేశాన్ని ఒక తాటిపైకి తెచ్చిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. రిజిస్ట్రార్ వి . లోకానాథ్  మాట్లాడుతూ పటేల్ యొక్క నాయకత్వాన్ని, దేశానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ప్రిన్సిపాల్ డా. మహబూబ్ భాష మాట్లాడుతూ భారతదేశ సమైక్యతకు ఆయన చేసిన కృషిని నొక్కి చెప్పారు. మరియు ఏక్ భారత్ శ్రేష్ట భారత్ ను గుర్తు చేశారు. ఈయొక్క కార్యక్రమమునకు ఉపకులపతి ప్రొఫెసర్. షావలి ఖాన్ , రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. లోకనాథ , ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. ఎస్. మహబూబ్ బాషా మరియు బోధన సిబ్బంది,  విద్యార్థులు హాజరయ్యారు.జారిచేయువారు రిజిస్ట్రార్, డా. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ, కర్నూలు.

About Author