NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు జిల్లా ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నెలవారీ నేర సమీక్ష

1 min read

ఏలూరు,జంగారెడ్డి గూడెం, పోలవరం,నూజివీడు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లు ఇన్స్పెక్టర్, ఎస్ఐలతో నిర్వహణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం సబ్ డివిజన్ల అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.మహిళా, పిల్లల భద్రత: మహిళలు, చిన్నారుల ఫిర్యాదులపై తక్షణ శ్రద్ధ వహించాలి. ఫోక్​సో కేసులు, గంజాయి/మత్తుపదార్థాల కేసుల విచారణను వేగవంతం చేయాలి.జూదం, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్, అశ్లీల ప్రదర్శనలు వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు, రౌడీ/సస్పెక్ట్ షీట్లు తెరవాలి.పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలి అని, బహిరంగ ప్రదేశాలలో మద్యం వినియోగం నిషేధం. షాపులు నిర్ణీత సమయాల్లో మాత్రమే తెరిచి ఉండాలన్నారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) శ్రీ ఎన్. సూర్య చంద్రరావు, ఎస్.బి ఇన్‌స్పెక్టర్ మల్లేశ్వర రావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ హబీబ్ భాషా తో పాటు ఇతర డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

About Author